wrapper

Beaking News

Wednesday, 15 May 2019 00:00

ప్రాజెక్టుల పూర్తిలో ఎంఈఐఎల్ రికార్డు

హైదరాబాద్: మౌలిక సదుపాయాల రంగంలో దిగ్గజ సంస్థ మేఘా ఇంజనీరింగ్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ లిమిటెడ్ (ఎంఈఐఎల్) గత ఆర్థిక సంవత్సరకాలంలో 130కి పైగా ప్రాజెక్టులను పూర్తి చేసి మరోసారి సత్తా చాటుకుంది.నిర్థేశించినగడువులోగా, నాణ్యతతో పనులు పూర్తిచేయడంలో ముందుండే ఎంఈఐఎల్ గత ఏడాదిలో ప్రపంచవ్యాప్తంగా 130కిపైగా విభిన్న ప్రాజెక్టులను పూర్తిచేసింది. ఇందులో ఎత్తిపోతల పథకాలు, తాగునీరు, విద్యుత్ ఉత్పత్తి మరియు సరఫరా, గ్యాస్ ప్రాసెసింగ్, సిటీ గ్యాస్ డిస్ట్రిబ్యూషన్ ప్రాజెక్టులు ఉన్నాయి. కేవలం ఏడు నెలల్లో ఎన్‌పీ కుంట సబ్ స్టేషన్ ను పూర్తి చేసినందుకు గానూ ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లోనూ ఇటీవల ఎంఈఐఎల్ స్థానం దక్కించుకుంది. కెయిర్న్ ఇండియా లిమిటెడ్ కంపెనీ కోసం రాజస్థాన్ లోని రాగేశ్వరివద్ద 80 ఎంఎంఎస్ఈఎప్ఈడీ సామర్థ్యం కలిగిన గ్యాస్ టెర్మినల్ ప్లాంట్ (ఆర్జీటీ) ప్రాజెక్టును ఎంఈఐఎల్ చేపట్టి, కేవలం ఆరునెలల రికార్డ్ సమయంలో పూర్తిచేసింది. సెప్టెంబర్ 2018లో పనులు ప్రారంభించగా, 2019 మార్చిలోనే ఈ ప్రాజెక్టును పూర్తిచేసింది. గుజరాత్ లో అనేక ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసిన ఎంఈఐఎల్ తాజాగా సౌరాష్ట్ర బ్రాంచ్ కెనాల్ పై 15 మెగావాట్ల సామర్థ్యం కలిగిన మూడు జలవిద్యుత్ కేంద్రాలను ఏర్పాటు చేసింది. గత ఏడాదిలోరెండు జలవిద్యుత్ కేంద్రాల్లో ఉత్పత్తి ప్రారంభం అయ్యింది. మూడో జలవిద్యుత్ కేంద్రం పనులన్నీ పూర్తి చేసుకొని విద్యుత్ ఉత్పత్తికి సిద్ధంగా ఉంది. ఎంఈఐఎల్ పూర్తిచేసిన 130 పైగా ప్రాజెక్ట్లో కొన్ని పూర్తిస్థాయిలోని ప్రాజెక్టులుగా కాగా మరికొన్ని ప్రాజెక్ట్ల్లో భాగమైన నిర్దేశించిన పనికి సంబంధించిన ప్యాకేజీలు కూడా ఉన్నాయి. ప్రతీ ప్యాకేజీని సాంకేతికంగా ఒక ప్రాజెక్ట్గానే పరిగణిస్తారు. కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో థర్మల్ విద్యుత్ కేంద్రం కోసం ఎంఈఐఎల్వైటీపీఎస్ ప్రాజెక్టును చేపట్టి సకాలంలో పూర్తి చేసింది. నదీ జలాలను సేకరించి థర్మల్ ప్లాంటుకు పంపింగ్ చేయడం, బూడిదతో కూడిన నీటిని యాష్బండ్ కు తరలించడం, అక్కడి నుంచి నీటిని తిరిగి సేకరించి ప్లాంటుకు పంపడం ద్వారా నీటి వినియోగాన్ని తగ్గించడం ఈ ప్రాజెక్టు ముఖ్య ఉద్దేశం. ఇందులో భాగంగా ఎంఈఐఎల్ జాక్ వెల్, పంప్ హౌజ్, పైప్ లైన్ లను ఏర్పాటు చేసింది. కాళేశ్వరం ప్రాజెక్టుకు విద్యుత్ సదుపాయాన్ని కల్పించే లిక్-1కు చెందిన నాలుగు సబ్ స్టేషన్ ను గతేడాదిఎంఈఐఎల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. ప్యాకేజీ-8లోని ప్రపంచంలోనే అతిపెద్ద మోటార్లు ఏడింటికి విద్యుత్ ను అందించే రామడుగు సబ్ స్టేషన్ ను తొలుత అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ తర్వాత 400/220 కేవీసుందిళ్ల సబ్ స్టేషన్,220 కేవీఅన్నారం సబ్ స్టేపన్, 220 కేవీమేడిగడ్డ సబ్ స్టేషన్ లను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆంధ్రప్రదేశ్ లోని నెల్లూరు పట్టణానికి, సమీప గ్రామాల్లోని 70 వేల ఇళ్లకుతాగునీటిని అందించేందుకు ఎంఈఐఎల్ నెల్లూరు తాగునీటిసరఫరా పథకాన్ని చేపట్టింది. తెలంగాణ ప్రభుత్వ ప్రతిష్ఠాత్మక ప్రాజెక్టు మిషన్ భగీరథలోని ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని అన్ని సెగ్మెంట్లతోపాటు ఉమ్మడి మహబూబ్ నగర్ తోపాటు నల్గొండ, మంగపేట, పాలేరు వరంగల్, దుమ్ముగూడెం, అదిలాబాద్ ఫేజ్ 1, 2 సెగ్మెంట్లను పూర్తిచేసి, తాగునీటిని సరఫరా చేస్తున్నది. అదేవిధంగాకర్ణాటకలోని దాసరహళ్లి, రాజస్థాన్ లోని కోట్రీ, అసింధ్, పాలి, షాపుర ప్రాజెక్టులు, ఒడిషాలోని భువనేశ్వర్ బల్క్, కియోన్జహార్, ప్రాజెక్టులతోపాటు ఉత్తరప్రదేశ్ లోని వారణాసి, ఆగ్రా ప్రాజెక్టులను పూర్తి చేసింది. సాగునీటి సరఫరా ప్రాజెక్టుల్లో ఆంధ్రప్రదేశ్ లో పురుషోత్తపట్నం, కొండవీటివాగు, హంద్రీనీవా ఫేజ్-2, చింతలపూడి ఎత్తిపోతల పథకాలను పూర్తిచేసింది. కర్ణాటకలో కోలార్, కన్వ, ఉత్తూర్ ప్రాజెక్టులు, ఒడిషాలో మెగా లిఫ్ట్ ఇరిగేషన్ స్కీమ్ లోని ఆరు లిఫ్ట్ లను కమిషన్ చేసింది. విద్యుత్ సబ్ స్టేషన్లలో కలికిరి, పొదిలి-సత్తెనపల్లి, గజ్వేల్, కేతిరెడ్డిపల్లి, మహేశ్వరం సబ్ స్టేషన్లతోపాటు నర్సాపూర్ లిలో లైన్ ను సకాలంలో పూర్తి చేసింది.
Read 263 times