wrapper

Beaking News

Thursday, 03 October 2019 00:00

పసలేని శివాజీ కుట్ర పురాణం

తెలుగుదేశం పార్టీ కనుసన్నల్లో నడిచే కుట్రల శివాజీ తాజాగా మరో కుట్రకు తెరతీశారు. ఇప్పటికే అనేక అభూత కల్పనలను ప్రచారం చేసి అవేమి నిజం కాక విశ్వసనీయతను కోల్పోయిన అవకాశాలు లేని సినీ నటుడు శివాజీ తాజాగా మేఘా ఇంజనీరింగ్ పై విషం కక్కుతున్నారు. పోలవరం ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చిన మేఘా ఇంజనీరింగ్ పై బురదజల్లేందుకు కొత్తనాటకం ప్రారంభించాడు. ఈ ఆరోపణల వెనుక రాజకీయ కుట్ర ఉందని విశ్లేషకులు అంటున్నారు. అయితే ఇప్పటివరకు శివాజీ చెప్పిన అనేక కథలు కేవలం పిట్ట కథలు మాత్రమే అని తేలిపోయింది. ఫలించని గరుడ, ద్రావిడ: ఎన్డీఏ నుంచి చంద్రబాబు బయటికి వచ్చిన తర్వాత నుంచి శివాజీ జ్యోతిషం చెప్పడం మొదలుపెట్టాడు. దానికి పచ్చ మీడియా విపరీతంగా ప్రచారం కల్పించింది. తొలుత బిజెపి ఆపరేషన్ గరుడ, ద్రావిడ పేరుతో నాటకం ప్రారంభించాడు. ఆపరేషన్ గరుడ పేరుతో చంద్రబాబు ప్రభుత్వాన్ని కేంద్రంలోని బిజెపి ప్రభుత్వం అస్థిరపరచాలని ప్రణాళిక వేసిందని. దక్షిణ భారత దేశంలో పాగా వేయడానికి బిజెపి ఆపరేషన్ ద్రావిడ కు రూపకల్పన చేసిందని ఇందుకు ఐదు వేల కోట్ల రూపాయలను కేటాయించిందని చెప్పాడు. దీనికి పచ్చ మీడియా బాగా ప్రచారం కల్పించింది. అయితే ఈ ప్రచారాలు చంద్రబాబుపై సానుభూతిని పెంచుతాయని ఎల్లో బాచ్ భావించిన అలాంటివి ఏమి జరుగకపోగా, అవి వికటించి చంద్రబాబు దారుణంగా ఓడిపోయారు. ఆ తర్వాత ప్రధాని నరేంద్ర మోడీ పై దేశ ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉందని, ఆయన ప్రచారం చేస్తే బిజెపికి కేవలం 80 నుంచి 120 సీట్లు మాత్రమే దక్కుతాయని జోస్యం చెప్పారు. కానీ అది కూడా నిజం కాలేదు. ఎన్నికలకు ముందు చంద్రబాబును కేసులు పెట్టి వేధిస్తారని గత ఏడాది సెప్టెంబర్లో చెప్పాడు. కానీ అది కూడా జరగలేదు. చంద్రబాబుపై ఈ దర్యాప్తు సంస్థ నోటీసులు జారీ చెయ్యలేదు. అల్లర్ల కట్టు కథలు: ఆ తర్వాత రాష్ట్రంలో ప్రముఖ నాయకుడిపై దాడికి ప్రణాళిక వేస్తున్నారని, తద్వారా రాష్ట్రంలో అల్లర్లు సృష్టించి రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బందులకు గురిచెయ్యాలని కుట్ర చేస్తున్నారని శివాజీ ఆరోపించాడు. తమకు తాముగా దాడి చేయించుకొని తద్వారా ప్రభుత్వానికి అప్రదిష్టపాలు చెయ్యాలని ఉద్దేశం అని శివాజీ ఆరోపించాడు. జగన్ మోహన్ రెడ్డిపై విమానాశ్రయంలో దాడి జరిగింది, కానీ ఎక్కడ అల్లర్లు జరగలేదు. అదేవిధంగా సానుభూతికోసం వారే ఆలా చేయించుకున్నారు అనడానికి ఆధారాలు లభించలేదు. నకిలీ పత్రాల సృష్టి: టివి 9 యాజమాన్యంలో తనకు షేర్లు ఉన్నాయనే నకిలీ పత్రాలను సృష్టించి సైబర్ క్రైమ్ పోలీసులకు సాక్ష్యాలతో సహా దొరికి అభాసుపాలయ్యాడు ఈ శివాజీ. టివి 9 కొత్త యాజమాన్యాన్ని ఇబ్బందుల పాలు చెయ్యాలని రవి ప్రకాశ్ తో కలిసి కుట్రపన్నారు. నేషనల్ లా ట్రిబునల్లో కేసు వేసేందుకు గాను పాత తేదీల్లో పత్రాలను సృష్టించి, శివాజీకి షేర్ టివి 9లో షేర్లు ఉన్నాయని నమ్మించే ప్రయత్నం చేసారు. ఈ కుట్రకు సంబంధించి శక్తి అనే వ్యక్తి నుంచి, డైరెక్టర్ ఎంకేవీఎన్మూర్తి, రవిప్రకాశ్, రవిప్రకాశ్ సన్నిహితుడైన హరి అనే వ్యక్తి, ఫైనాన్స్ అధికారిగా ఉన్న మూర్తిఅనే మరో వ్యక్తి మధ్య బదిలీ అయిన ఈ-మెయిళ్లను సైబర్ క్రైమ్పోలీసు అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే సైబర్ పోలీసులు వాటిని నకిలీ పత్రాలుగా తేల్చారు. టివి9లో వారి పెట్టుబడులకు సంబంధించి వారిద్దరూ ఎన్సిఎల్టిలో దాఖలు చేసిన కేసు వీగిపోయింది. తమను పెటుబడిదారులుగా పరిగణించాలని వారు వేసిన కేసును న్యాయమూర్తి 2019 మే 24న తిరస్కరించారు. మేఘా పై తాజా కుట్ర: ఇలా అనేక అక్రమాలకు పాల్పడి, అభూతకల్పనలను ప్రచారం చేస్తున్న శివాజీ తాజాగా మేఘా ఇంజనీరింగ్ లక్ష్యంగా ఆరోపణలకు దిగాడు. నటుడు శివాజీకి సినిమా అవకాశాలు పూర్తిగా కనుమరుగయ్యాయి. తెలుగుదేశం నాయకునిగా మారిపోయి ఎన్నికల్లోనూ ప్రచారం సాగించారు. ఇక సెలబ్రెటీలు సాధారణంగా ప్రచారం కోరుకుంటారు. దానికి తోడు పచ్చమీడియా మద్దతు ఉంది. అదే సమయంలో ఎపిలోని జగన్ ప్రభుత్వం నాటి చంద్రబాబు అవినీతి అక్రమాలను వెలికితీస్తూ అందులో భాగంగా పోవరం కాంట్రాక్టు రద్దుచేసి టెండర్లు పిలువగా మేఘా ప్రభుత్వానికి రూ. 720 కోట్లు మిగిలే విధంగా బిడ్డు దాఖలు చేసింది. ఈ పరిణామం చంద్రబాబుకు మింగుడు పడలేదు. క్విడ్ ప్రోకో ఆరోపణలకు దిగారు. ఎలక్ట్రిక్ బస్సులను ఇందులోకి లాగారు. జగన్ ప్రభుత్వం తమ పంతాన్ని నెగ్గించుకోవడానికి పోలవరం టెండర్లను రద్దు చేసిందని, తక్కువకు చెయ్యడానికి ముందుకు వచ్చిన మేఘ ఇంజనీరింగ్ కు బస్సులను కొనుగోలు చెయ్యడం ద్వారా నష్టాన్ని భర్తీ చేస్తారని ఒక కొత్త ప్రచారానికి తేర తీశారు. దేశంలో మొత్తం మీద అన్ని రాష్ట్రాల్లోనూ మూడేళ్ళలో రూ. 3,545 కోట్లు వ్యయం చేసేందుకు కేంద్రం నిర్ణయించగా చంద్రబాబు ఏకంగా ఏపీలోనే రూ. 7500 కోట్ల స్కామ్ పోవరం క్విడ్ప్రోకో పేరిట జరుగుతోందంటూ ఆరోపించిన సంగతి తెలిసిందే. అసు ఆంధ్రప్రదేశ్ కు బస్సు కొనుగోలు లో స్వేచ్ఛ, అధికారాలు లేకపోయినప్పటికీ నేరుగా కొనేస్తుందంటూ ఆయన చెప్పటం వెనుక పోవరం ప్రతిష్టను మంటగపటమే. అసలు క్విడ్ ప్రోకో అంటూ కొత్త నామకరణం చేసేసి తమ కాలంలో జరిగిన అక్రమాలు , అవకతవకల నుంచి బయటపడేందుకు కొత్త ఆరోపణలను తెరమీదకు తెచ్చారు. ఏపీఎస్ఆర్టీసి నేరుగా బస్సులు కొనుగోలు చేసే పద్ధతే లేనప్పుడు ఇక ఒలెక్ట్రా నుంచి ఎలక్ట్రిక్ బస్సులు కొనుగోలు చేయడం ఎలా సాధ్యమవుతుంది? ఆర్టీసి నష్టాలతో నడుస్తుండడంతో బస్సుల కొనుగోలు విధానం నిలిపివేసి పూర్తిగా లీజు పద్ధతిలో సేకరిస్తూ ప్రయాణికుల అవసరాలు తీర్చే విధంగా నడుపుతున్నారు. కుట్రల శివాజీ మరో కుతంత్రానికి తాజా పురాణం చెబుతున్నారు. ఈ విధమైన కథనాలు ఆఖరుకు పచ్చమీడియా కూడా నమ్మే పరిస్థితిలేదు. దాంతో ఆయన సినిమా పద్థతిలో వీడియో క్లిప్ ను వైరల్ చేసే పద్థతి ఎంచుకున్నారు. అటు ఎపి ప్రభుత్వాన్నీ రాజకీయంగా దెబ్బతీయటం అందులో భాగంగా మేఘా మీద బురదజ్లడం. ఇది తెలుగుదేశం స్క్రిప్ట్ లో భాంగానే కనిపిస్తోంది. అందులో భాగంగా ఆయన వెలుగులోకి తెస్తున్న దశలవారీ మరో గరుడ పురాణం కానుంది. తెలుగుదేశం పార్టీ చెప్పినట్లు ఎప్పుడూ వ్యవహరించే శివాజీ తాజాగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ ప్రతిష్టను దెబ్బతీసే విధంగా పోలవరం ప్రాజెక్టును చేపట్టేందుకు ముందుకు వచ్చిన మేఘా ఇంజనీరింగ్ సంస్ధను వివాదం చేయటం ద్వారా టిడిపి ఆరోపణకు బలం చేకూర్చే పథకం ఇది. ఎంఈఐఎల్ బ్లాక్ మెయిలింగ్ వివాదంలోకి లాగడం ద్వారా చంద్రబాబు చేస్తున్న ఆరోపణలకు ఊతం ఇవ్వాలని ఆయన లక్ష్యం. ఇది ఆయన నటిస్తున్న టిడిపి రచించిన రాజకీయ కుట్రగా ఉందనే అనుమానాలకు బలం చేకూరుతోంది.
Read 39 times