wrapper

Beaking News

Wednesday, 09 October 2019 00:00

వెలుగులోకి వస్తున్న ఫోర్జరీ ప్రకాష్ లీలలు

ఖైదీ నెంబర్‌ 4412... ఇదేదో సినిమా కాదు. రవి ప్రకాష్‌ కాదు కాదు ఫోర్జరీ ప్రకాష్‌కు చంచల్‌గూడ జైలు అధికారులు కేటాయించిన నెంబర్‌. మెరుగైనా సమాజం కోసం అంటూ నీతులు వళ్లించిన రవిప్రకాష్‌ టీవీ9 లో అవకతవకలు, అక్రమంగా నిధులు మిళ్లింపు చేశారని అలంద మీడియా ఆయన పైన కేసు పెట్టిన విషయం తెలిసిందే. టీవీ9లో సీఈఓ హోదాలో ఉన్నప్పుడు రవిప్రకాష్‌ చేసిన మోసాలు, దందాలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తున్నాయి.  టీవీ9 అమ్మకం పూర్తైన తరువాత దశాబ్ద కాలంగా సంస్థనే నమ్ముకుని ఎంతో కొంత బోనస్‌ వస్తుందని ఆశిపడ్డ ఉద్యోగులకే రవిప్రకాష్‌ సున్నం పూశారు. బోర్డ్‌ అనుమతి లేకుండా రవి ప్రకాష్‌ బ్యాచ్‌ కోట్ల రూపాయలను విత్‌డ్రా చేసుకుని సొమ్ము చేసుకున్నారు.  ఉదయం లేవగానే టీవీ9 తన ఒక్కడి వల్లే ఈ స్థాయిలో ఉందని, అవినీతి లేని మెరుగైన సమాజం కోసం అనే ముసుగులో సంస్థలోని నిధులు అక్రమంగా తరలించారు. టీవీ9 పేరుతో రవిప్రకాష్‌, మూర్తి, క్లిఫర్డ్‌ పెరారీ 18 కోట్లదోపిడి ఆధారాలతో సహా అడ్డంగా దొరికిపోయి ప్రస్తుతం చంచల్‌ గూడ జైల్లో రిమాండ్‌ ఖైదీగా ఉన్నాడు. టీవీ9 బహిష్కృతసీఈవో రవి ప్రకాష్‌ చుట్టూ ఈడి, సీబిఐ, మనీలాండరింగ్‌, బ్లాక్‌మెయింలింగ్‌ కేసు కూడా చుట్టుకోనున్నాయా అంటే అవుననేఅంటున్నాయి మీడియా వర్గాలు. ఆర్పీ పై ఉద్యోగుల్లో ఆగ్రహం ఆరున్నర కోట్లను బోనస్‌గా తీసుకున్న రవి ప్రకాష్‌ ఉద్యోగులకు మాత్రం కేవలం రెండే రెండు సార్లు బోనస్‌ ఇచ్చారు. అది కూడా ఒకసారి సగం నెల జీతం మాత్రమే. బోనస్‌ ఇచ్చిన ఏడాది జీతాలుపెంచనే లేదు. 2014 తర్వాత మూడేళ్లు వరుసగా జీతాలుపెంచనేలేదు. తాను మాత్రం 6.50 కోట్లను తీసుకుని మరో ఐదున్నరకోట్లను బోనస్‌ రూపంలో మూర్తికి కట్టబెట్టాడు. ఆర్పీ అరెస్ట్‌తో టీవీ9 ఉద్యోగుల నుంచి ఏ మాత్రం సానుభూతి రాకపోవడానికి కారణంఇదే. ఉన్నన్ని రోజులూ జీతాలు సరిగ్గా పెంచక, పెంచినా తన వారికేఎక్కువ ఇచ్చి, చాలా మందిని నిర్ధాక్షిణ్యంగా ఉద్యోగం నుంచి పీకేసి, కొంతమందికి జీతాలు కోసేసి ఒకటా రెండా... చాలా దారుణమైన ఉద్యోగ వ్యతిరేక చర్యలు ఆర్పీపై ఉద్యోగుల్లో ఆగ్రహానికికారణమయ్యాయి. ఏడాది కాలంలో సుమారు రూ.18 కోట్ల మేర టీవీ9 నిధులను రవిప్రకాష్ బృందం దారిమళ్లించినట్లు అలందా మీడియా ఫిర్యాదుచేసింది. గత నెలలో అలందా మీడియా యాజమాన్యం ఇచ్చినఫిర్యాదు మేరకు బంజార హిల్స్ పోలీసులు శనివారం రవిప్రకాష్‌నుఅరెస్ట్ చేశారు. బోనస్, ఎక్స్‌గ్రేషియా పేరుతో సొంత ప్రయోజనాలకు… రవి ప్రకాశ్ సుమారు రూ.18 కోట్ల నిధులనుదుర్వినియోగం చేశారని, కంపెనీ అకౌంట్ నుంచి డ్రా చేసుకొనిసొంత ఖర్చుల కోసం వాడుకున్నరని. బోనస్, ఎక్స్‌గ్రేషియా పేరుతోసొంత ప్రయోజనాలకు ఈ నిధులు వాడుకున్నారు. ఇందులోఎలాంటి నియమ నిబంధనలను పాటించలేదు. బోర్డు, షేర్ హోల్డర్స్ఆమోదం లేకుండానే డబ్బును విత్ డ్రా చేసి కంపెనీకి నష్టంచేకూర్చారు. టీవీ9 స్థాపించినప్పటి నుంచి వేల మందిని నడిరోడ్డు మీదకు నెట్టాడీ ఫోర్జరీ ప్రకాష్‌. ఎంతో మంది జర్నలిస్టుకు ఉద్యోగాు ఇప్పించానని, జర్నలిస్టు కోసం తాను పోరాడుతున్నానని కవరింగ్‌ఇచ్చే రవి ప్రకాష్‌ ఆ ముసుగులో ఎంతో మంది ఉగ్యోగునుఉన్నట్టుండి పీకేసిన సందర్భాు చాలా ఉన్నాయి. ఇక ఇన్‌పుట్‌, అవుట్‌పుట్‌ డెస్కుల్లో రవి ప్రకాష్‌ టార్చర్‌ భరించలేక ఎంతో మందిఉద్యోగం మానేసారో లెక్కేలేదు. సొంత సంస్థకే కన్నం వేసి‌ సున్నపూసిన ఘనుడు.. Tv9 సీఈఓ వున్నన్ని రోజులు ఇక్కడి అక్రమ సంపాదనతో‌పాటు,లాండ్ సెటిల్‌మెంట్లు, బెదిరింపులు ,సొంత సంస్థకే కన్నం వేసి‌సున్నం‌పూసి సంపాదించిన అక్రమ సొమ్ములతో రవిప్రకాష్  ఆఫ్రికాలో పెట్టిన పెట్టుబడులను ఆధారలతో సహా బయటపెట్టాడు వైసీపిఎంపీ విజయ సాయి రెడ్డి. హవాలా సొమ్ములను కెన్యా,ఉగాండాలో రవిప్రకాష్ కంపాల సిటీ కేబుల్ లో పెట్టుబడులు పెట్టాడని, అవినీతి వ్యాపారాల జాబితాను,పలు సంస్థల్లో పెట్టిన షేర్లవివరాలను ఆధారాలతో సహా చీఫ్ జస్టిస్ కు లేఖ లో తెలిపినవిజయ సాయి రెడ్డి ఫిర్యాదుపై ఎలాంటి యాక్షన్ వుంటుందో అన్నదిఇప్పుడు ఆసక్తిగా మారింది.  మనీ లాండరింగ్ సొమ్ములతో తనభార్య దేవిక పేరు తో వివిధ పేర్లతో రిజిస్ట్రేషన్ చేయించిన RP ఫ్యాక్టరీ సంస్థలలోకి ఆనిధులను  రవిప్రకాష్ పెట్టుబడు పెట్టారనే దానిపై ఉచ్చుబిగుస్తోంది.   Tv9 సీఈఓ ముసుగులో రవిప్రకాష్ చేసిన అవినీతి,దందాలు, బ్లాక్మెయిల్, మనీ లాండరింగ్,టాక్స్ ఎగవేతపై విచారణ జరిపించాలనిఏకంగా సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు లేఖ వెళ్లిందంటే రవిప్రకాష్  14 ఏళ్ల లో tv9 పేరు తో ఎంత మింగేశాడో ని చర్చ ఇప్పుడు రాజకీయవర్గాల్లో కూడా చర్చ జరుగుతోంది.
Read 28 times Last modified on Wednesday, 09 October 2019 08:45