wrapper

Beaking News

Friday, 15 November 2019 00:00

అడ్డంగా ఐటీకి బుక్కైంది ఆ ‘పచ్చ’నాయకుడేనా?

ఆంధ్రప్రదేశ్ ఓ ముఖ్యనాయుకుడికి ఒక ప్రముఖ కంపెనీ నుంచి 150 కోట్ల రూపాయలు అందాయంటూ ఆదాయపు పన్ను శాఖ బహిరంగంగా ప్రకటించినప్పటికీ ప్రతీ చిన్న విషయాన్ని గగ్గోలు పెట్టి రాద్ధాంతం చేసే తెలుగుదేశంల పార్టీతో పాటు జాతి మీడియా తేలుకుట్టిన దొంగల్లాగా నోరు మెదపకపోవడం వెనుక ఆంతర్యం ఏమిటి? ఆ డబ్బు ఎవరికి అందిందో వారికి తెలిసిపోవడం వల్లనేనా? అమరావతిలో రూ. 2652 కోట్ల పనులకు సంబంధించి ఓ కంపెనీ నాటి ముఖ్యనేతకు అందచేసిన సొమ్ము ఆధారాలు ఐటీ అధికారుల చేతికి చిక్కడంతో తెలుగుదేశం నాయకులు కుక్కిన పేనులా బిక్కుబిక్కు మంటున్నారు. ప్రతీ చిన్నదానికి ఇతరులపై బుదర పూసేసే ఆ పార్టీ నేతలు ఈ వ్యవహారంలో మాత్రం నోరు మెదపకపోవడాన్ని బట్టి తమ నేత అడ్డంగా బుక్కైన సంగతి వారికి అర్థమైపోయింది. బీజెపి అధినాయకత్వం పట్టుబిగించి ఆ చంబా నేత అక్రమార్జనను తమ రాజకీయ అవసరాల కోసం వినియోగించుకునే సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. నలభైఏళ్ళ తన రాజకీయ అనుభవంతో ఎందరికో ఓనమాలు నేర్పి ప్రపంచానికే ఐటీని పరిచయం చేశానని గొప్పగా చెప్పుకునే చంబా నాయకుని చేతికే ఆ డబ్బు చేరడం వల్లనే తెలుగుదేశం పార్టీ నోరు విప్పలేకపోతోందా? ముంబై కేంద్రంగా పనిచేసే ఓ కంపెనీ అమరావతిలోనూ, ఆంధ్రప్రదేశ్ అప్పట్లో పనులు చేపట్టినప్పుడు తనవంతు వాటాగా అందించిన మొత్తాల్లో కొంత మొత్తం అధికారికంగా చంబా నాయకుని చేతికి చేరినట్లు ఇటీవల ఐటీ నిర్వహించిన సోదాల్లో వెలుగు చూసింది. ఆ విషయాన్ని ఈ నెల 11వ తేదిన ఢిల్లీలో కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ కార్యాలయం ద్వారా ఐటీ శాఖ అధికారికంగా విడుదల చేసిన ప్రకటనల్లో స్పష్టంగా పేర్కొంది. ఆ తర్వాతి రోజు ఐటీ సంస్థ తన వెబ్ కూడా ఆ ప్రకటనను చేర్చింది. మొత్తం దక్షణ భారతదేశంలోనూ, ఢిల్లీ, ముంబై నిర్వహించిన సోదాల్లో మొత్తం 3300 కోట్లు పనులకు సంబంధించి అక్రమాలు జరిగాయని ప్రకటించింది. అందులో ఆంధ్రప్రదేశ్ సంబంధించి ఓ ముఖ్యనేతకు 150 కోట్లు అందినట్లు స్పష్టమైన సమాచారం తమ వద్ద ఉన్నట్లు పేర్కొంది. ఈ కంపెనీ ముంబైకి చెందినది. దేశ వ్యాప్తంగా నిర్మాణ రంగంలో ప్రత్యేకత ఉంది. నాణ్యత ప్రమాణాలు పాటిస్తుందనే మంచి పేరు ఉంది. అయితే ధర ఎక్కువగా ఉంటుంది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కూడా ఈ సంస్థ ప్రభుత్వ, ప్రైవేటు పనులు చేపట్టింది. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ వస్తే అప్పటి ప్రభుత్వం అమరావతి డెవలప్ అథారిటీ పేరుతో రాజధాని నిర్మాణం కోసం అనేక ప్రాజెక్ట్ చేపట్టింది. అందులో చాలా వరకు ప్రాథమిక దశలోనే ఉండిపోయాయి. వీటిని కొత్త ప్రభుత్వం రద్దు చేసింది. అప్పట్లో ప్రధానంగా రాజధాని నిర్మాణానికి సంబంధించిన తాత్కాలిక భవనాలను చేపట్టిన కంపెనీల్లో ఈ కంపెనీ కూడా ఉంది. అదే విధంగా భవిష్యత్తు కోసం రాజధాని ప్రాంతంలో వివిధ వర్గాల వారికి గృహ నిర్మాణాలు చేపట్టేందుకు నాటి ప్రభుత్వం మూడు కంపెనీలకు పనులు అప్పగించింది. అందులో ఈ కంపెనీకి అత్యధిక భాగం పనులు దక్కాయి. ఈ కంపెనీ నుంచే నేరుగా చంబాకు 150 కోట్లు చేరినట్లు ఐటీ సంస్థ తన దర్యాప్తులో నిర్ధారించుకుంది. అమరావతి సిఆర్ పరిధిలో నిర్మాణ పనులకు మూడు సంస్థలను అప్పటి ప్రభుత్వం ఎంపిక చేసింది. ఇందులో తాత్కాలిక సచివాలయాల నిర్మాణం పూర్తైంది గాని అందులో నాణ్యత కొరవడింది. ఆ పనిలో కొంత భాగం చేయడంతో పాటు వివిధ వర్గాల వారికి 2652 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో చేపట్టిన గృహాల సముదాయ నిర్మాణ పనుల్లో సింహభాగం ఈ సంస్థకే దక్కింది. ప్రధానంగా రెసిడెన్షియల్ టవర్ల నిర్మాణం వివిధ సైజుల్లో చేపట్టాలని నిర్ణయించారు. గరిష్టంగా 3500 చదరపు అడుగులు, మధ్యస్థంగా 1800 చెదరపు అడుగులు, కనిష్టంగా 1200 చదరపు అడుగలతో పాటు తక్కువగా 900 చదరపు అడుగులు వైశాల్యంతో ఫ్లాట్లు నిర్మించాలనేది లక్ష్యం. ఇవి పూర్తిగా శాసనసభ్యులు, మంత్రులు, ఉన్నతాధికారులు (ఐఏఎస్, ఐపీఎస్)లతో పాటు గెజిటెడ్ అధికారులు, వారి క్రింద యంత్రాంగానికి వినియోగించే విధంగా వీటిని చేపట్టాలనే విధంగా 2652 కోట్ల ప్రాజెక్ట్ ఆ మూడు కంపెనీలకు నాటి ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ పని తీసుకున్నందుకు ఆయా సంస్థల నుంచి కనీసం 20 శాతం చొప్పున మూడుపులు ముట్టచెప్పే విధంగా ఒప్పందం కుదిరింది. అందులో భాగంగా జరిగిన చెల్లింపుల్లో దాదాపు 700 కోట్ల చెల్లింపుల్లో 150 కోట్ల రూపాయలు అధికారికంగా చేతులు మారినట్లు ఐటీ సోదాల్లో స్పష్టంగా దొరికిపోయింది. చంబా నేత చేతికే ఆ మొత్తం చేరినట్లు ఐటీ అధికారులు నిర్ధారణకు వచ్చారు. అయితే కేంద్రంలోని బీజెపి ప్రభుత్వం తమ రాకీయ అవసరాల కోసం దర్యాప్తు సంస్థలైన సీబిఐ, ఈడి, ఐటీ, ఎస్ మొదలైన వాటిని వినియోగించుకుంటోందనే విమర్శ బలంగా ఉంది. అందుకు తగిన విధంగానే ఇటీవల కాలంలో ఐటీ దాడులు జరుగుతున్నాయి. అదే సమయంలో ఐటీ అధికారులు విడుదల చేస్తున్న ప్రకటనలు కూడా అందుకు తగిన విధంగా ఉంటున్నాయి. వారి ప్రకటనల్లో రాజకీయ కోణం కనిపిస్తోంది. రాజకీయ నేతలనే ముఖ్యంగా చంబాలాంటి వారు బరితెగించి పనుల్లో ముక్కుపిండి డబ్బులు వసూలు చేస్తున్నందన వాటి ఆధారాలు దొరికినప్పుడు విడుదల చేస్తున్న ప్రకటనల్లో ఆ అంశాలు ప్రస్తావిస్తున్నందున రాజకీయంగా కనిపిస్తున్నాయని మరికొందరు విశ్లేషిస్తున్నారు. మొత్తానికి బీజెపి అధినాయకత్వం చేతుల్లో చంబా ఆయువుపట్టు ఇరుక్కుంది. ముఖ్యంగా నిర్మాణ రంగంలో లబ్ధప్రతిష్ట సంస్థలుగా పేరొందిన వాటితో చంబాకు ఎప్పుడూ అవినాభవా సంబంధమే ఉండేది. రాష్ట్ర విభజనకు ముందు హైదరాబాద్ అప్పటి సచివాలయంలో భవన నిర్మాణ పనులను నాటి ముఖ్యమంత్రి ఓ సంస్థకు అప్పగించిన విషయం వివాదాస్పదమైంది. అత్యంత ఖరీదుతో నిర్మించిన ఆ భవనం వినియోగానికి అనుకూలంగా లేకపోవడంతో మార్పులు, చేరుల్ప తరువాత ఉపయోగంలోకి తెచ్చారు. బీజెపితో రహస్య ఒప్పందానికి చంబా తహతహ ఇదే సమయంలోనే బీజెపితో రహస్య ఒప్పందానికి ఆ నేత ప్రయత్నాలు ప్రారంభించారు. తాను ఎన్నికలకు ముందు ఆ పార్టీతో విబేధించడం రాజకీయంగా చేసిన పెద్ద తప్పేనని ఒప్పేసుకున్నారు. ఇది కేవలం కేంద్ర దర్యాప్తు సంస్థల నుంచి తనకు తన పార్టీ వారికి ఇబ్బందులు ఎదురుకాకుండా ఉండేందుకే ఆయన ఆ విధంగా సరెండయ్యారు. కానీ ఐటీ దాడులు మాత్రం ఆగలేదు. ఈ పరిస్థితి ముందే వస్తుందని ఊహించడం వల్లనే తమ పార్టీకి సంబంధించిన కొందరు ఎంపీలను నేరుగా బీజెపిలోకి పంపించారు. వారు బీజెపిలో చేరినప్పటి నుంచి తమ నేత అజెండాను ఏపిలో బీజెపి ద్వారా అమలు చేయించడానికి ప్రయత్నాలు ప్రారంభించారు. వారు బీజెపిలో చేరినప్పటికీ కేంద్ర దర్యాప్తు సంస్థలు తమ కత్తికి పదును తగ్గించనే లేదు. దేశ వ్యాప్తంగానూ, మరీ ముఖ్యంగా దక్షిణభారతదేశంలో వివిధ సంస్థలపై దర్యాప్తు ముమ్మరం చేశారు. అందులో భాగంగానే గత ఏప్రిల్ నెలలో తెలుగుదేశం పార్టీ నాయకులకు సంబంధించిన దాడుల్లో బయటపడిన ఆధారాల ఆధారంగా ఈ నెలలో ఐటీ దాడులు మళ్లీ నిర్వహించాయి. ఈ దాడుల్లో చెంబా నేతకు చేరిన సొమ్ము ఆధారాలు అడ్డంగా దొరికిపోయాయి.
Read 44 times